కోలీవుడ్‌లో ఐటి సోదాల కలకలం
ప్రముఖ నిర్మాత చెజియన్ ఇళ్లపై దాడులు
చెన్నై,ఆగస్ట్2(జనంసాక్షి): కోలీవుడ్‌లో ఐటీ శాఖ నిర్వహిస్తోన్న సోదాలు తీవ్ర సంచలనంగా మారాయి. రాజకీయ నేతలతో పాటు, సినీ ప్రముఖులనూ వదలకుండా అధికారులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడు లో ప్రముఖ ఫైనాన్షియర్, చిత్ర నిర్మాత అన్బు చెజియన్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కాగా తాజాగా 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. కలైపులి థాను, ఎస్‌ఆర్ ప్రభు, అన్బు చెజియన్, జ్ఞానవేల్ రాజా సహా దాదాపు 10 మంది
తమిళ నిర్మాతలు, ఇతర ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. చెన్నై, మధురై సహా ఆ రాష్ట్రంలోని మొత్తం 10 చోట్ల అన్బుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు చేసింది. ఇదే తరహాలో 2020 ఫిబ్రవరిలోనూ ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. అప్పట్లో చెన్నై, మధురైలోని నివాసాల నుంచి రూ.50కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన స్నేహితుడు తనిఖీలు చేపట్టిన అధికారులకు.. మధురైలో ఉన్న నివాసం నుంచి రూ.15కోట్లు జప్తు చేశారు. అదే సమయంలో హీరో విజయ్ ఇళ్లలోనూ సోదాలు జరిపి, ఆయన్ను ప్రశ్నించారు. కాగా ఇప్పుడు మరోసారి ఆయన అదే తరహాలో దాడులు జరగడంతో తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ఇక తమిళ సినీ పరిశ్రమలో అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాధించిన అన్బు చెజియన్… హీరో విజయ్ నటించిన బిగిల్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. గోపురం ఫిలింస్ అనే బ్యానర్ పైనా ఆయన కొన్ని సినిమాలు నిర్మించారు.