కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్ లు తీసుకొని ఆరు మాసాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలి.
–
జిల్లా కలెక్టర్ కె. శశాంక.
మహబూబాబాద్ బ్యూరో-జూలై16(జనంసాక్షి)
కోవిడ్ రెండు డోస్ లు తీసుకొని ఆరు మాసాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు. ఆజాది కా అమృత్ మహోత్సవం లో భాగంగా ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రజలందరికీ కోవిడ్ వాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రికాషనరీ (బూస్టర్) డోస్ ఇచ్చుటకు నిర్ణయించనైనదనీ, ఇందులో భాగంగా జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన ప్రజలందరూ ఎవరైతే రెండవ కోవిడ్ డోస్ తీసుకొని ఆరు మాసాలు అయివున్న వారందరూ ఈ అదనపు బూస్టర్ డోస్ తీసుకునుటకు అర్హులు అని తెలిపారు. జిల్లాలో 5,86,832 మంది ఉన్నారని, వీరందరికీ ఈ నెల 15 నుండి సెప్టెంబర్ 30 వరకు 75 రోజుల పాటు ఒక ఉద్యమ రూపంలో బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వడానికి వైద్య, ఆరోగ్య శాఖ అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ అదనపు టీకాలు ఉచితంగా జిల్లాలోని అన్నీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, సివిల్ అస్పత్రులలో, జిల్లా హాస్పిటల్ అన్నింటిలో ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామని, జిల్లాలోని 18 సంవత్సరాలు పైబడి రెండవ కోవిడ్ టీకా తీసుకొని కనీసం 6 నెలలు పూర్తి అయినా ప్రతి ఒక్కరు దగ్గరలోని ప్రభుత్వ అస్పత్రులలో తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా జిల్లాలోని అన్నీ జూనియర్, డిగ్రీ కాలేజీలలో ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఉత్తమ సేవలు అందించినందుకు కాయకల్ప అవార్డుకు జిల్లాలోని పి.హెచ్.సి.లు, సబ్ సెంటర్ ఆసుపత్రులు ఎంపిక అవడంపై జిల్లా కలెక్టర్, డాక్టర్ హరీష్ రాజ్ లు సంయుక్తంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.