కోహ్లీ సేనకు బిసిసిఐ బంపర్ ఆఫర్: ఇక జీతాలు డబుల్

22-1463905092-anuragthakur-02-1475392481న్యూఢిల్లీ: భారత టెస్ట్ క్రికెట్‌ ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ’ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. టెస్టు మ్యాచ్‌ ఫీజును ఒక్కసారిగా డబుల్‌ చేసింది. ప్రస్తుతం ఒక్కో టెస్టు మ్యాచ్‌కు ఒక్కో ఆటగాడు రూ.7లక్షలు అందుకుంటున్నాడు. కాగా, ఇప్పుడు ఆ మ్యాచ్‌ ఫీజును డబుల్‌ చేసేసింది. దీంతో ఇక నుంచి ఒక్కో ఆటగాడు ఒక్కో మ్యాచ్‌కు రూ.15లక్షలు అందుకోనున్నాడు. రిజర్వులో ఉండే ఆటగాళ్లకు ఇప్పటి వరకు రూ. 3.5లక్షలు మ్యాచ్ ఫీజు చెల్లిస్తుండగా, అది ఇక నుంచి రూ. 7లక్షలుగా చెల్లించడం జరుగుతుంది.

టెస్టు మ్యాచ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేందుకు ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజు పెంచినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. కొత్త తరాల్లో, భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గకూడదన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. శుక్రవారం ముంబైలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఠాకూర్‌ ప్రకటించారు. కాగా, బిసిసిఐ తన ఆధ్వర్యంలోని ఇతర సంఘాలకు వార్షికంగా ఇచ్చే సబ్సిడీని 60 లక్షల నుంచి రూ. 70లక్షలకు పెంచడం జరిగింది.