కౌలురైతులకు రుణాల్లో మొడిచేయి

అనంతపురం,నవంబర్‌11 (జనం సాక్షి): కౌలు రైతులు ఆదరణకు నోచడం లేదుని, ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కౌలు రైతుల చట్టం కాగితాలకే పరిమిత మయ్యిందని కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు అన్నారు.  కౌలు రైతులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నా, అందులో కొంతమంది మాత్రమే అర్హులంటూ కౌలు రైతులను గుర్తింపుకార్డులు ఇచ్చారు. వీరికి రుణ అర్హత గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ రుణ గుర్తింపు కార్డుల ముఖ్య ఉద్దేశం బ్యాంకు రుణాలు పొందడానికి. కానీ బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు మొండి చేయి చూపారు. అయితే  కౌలు రైతుల కన్నా ముందే పట్టాదారు రైతులు రుణాలు పొందారని, తిరిగి కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం కుదరని  బ్యాంకర్లు చెబుతున్నారు. ఒక వేళ పట్టాదారు రైతులు రుణాలు పొందని పక్షంలో కౌలు రైతులకు రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకర్లు సమాధానం ఇస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం కేవలం కొంతమందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ప్రారంభించారు. అరకొరగా కౌలు రైతులకు రుణాలు నామమాత్రంగానే ఇప్పిస్తున్నారు. మిగిలిన కౌలు రైతుల పరిస్థితికి తామేవిూ చేయలేమని చేతులు దులుపుకున్నారు. ఈ సమస్యను పరిస్కరించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.