కౌలు రైతుల రుణాలు రద్దు చేయాలి

 

 

ఏలూరు,జూలై24(జ‌నంసాక్షి): /ూష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల రుణాలను వెంటనే రద్దు చేయాలని లేనిచో రైతులంతా కదలి బ్యాంకులను ముట్టడించాల్సి వస్తుందని కౌలు రైతు సంఘం కార్యదర్శి శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాసాధికార సంస్థ రుణాలు రద్దు చేయటానికి సిద్ధంగానున్న బ్యాంకర్లు రైతుల రుణ డేటా పంపించకపోవటంతో తీసుకున్న రుణాలు రద్దుగాక ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం రైతాంగం అల్లాడిపోతోందని అన్నారు. కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వకపోవటంతో పంట పెట్టుబడుల కోసం ప్రయివేట్‌

వడ్డీవ్యాపారులపై ఆధారపడటం మూలంగా అధికవడ్డీల భారంతో సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ఆయన తెలిపారు. 2013 భూసేకరణ చట్టాన్ని యదాతథంగా అమలు చేయాలని అన్నారు. 60 ఏళ్లు దాటిన పేద, మధ్యతరగతి రైతులందరికీ రూ.5000 నెలసరి పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. పంట పెట్టుబడులు, రైతుల ఇతర అవసరాల కోసం ఎకరానికి 10 వేల చొప్పున 5 ఎకరాల లోపు వారందరికీ సహాయం చేయాలన్నారు.డా.స్వామినాథన్‌ సూచనలు ప్రకారం అన్ని పంటలకూ ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్ధతు ధరలు నిర్ణయించాలని తెలిపారు. కేరళ రుణ విముక్తి చట్టం మాదిరిగా రుణగ్రస్తులైన రైతుల ప్రయివేట్‌ అప్పులతో సహా ఒకేసారి మాఫీ చేయాలన్నారు. వీటిపై పార్లమెంటులో చట్టం చేయాలన్నారు.

తాజావార్తలు