క్రికెట్‌ టోర్నీని అడ్డుకోవాలని సర్కార్‌ కుట్రపన్నింది

– ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌పై పరువు నష్టం దావా వేస్తా
– వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపణ
– నగరిలో  వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం
తిరుపతి, జులై27(జ‌నం సాక్షి) :  వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నీని అడ్డుకొనేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. శుక్రవారం రోజా ఆధ్వర్యంలో నగరిలో ఘనంగా వైఎస్సార్‌ క్రికెట్‌  టోర్నమెంటు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు. క్రికెట్‌ టోర్నమెంటుకు ప్రభుత్వ డ్రిల్‌ మాస్టర్లను పంపాలని తాను ఈ నెల 21న జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చానని అన్నారు. ఇందుకు వారు పంపుతానని కూడా తెలిపారని అన్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు డ్రిల్‌ మాస్టర్లను రానీయకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. ఇది తన విూద కక్ష సాధింపేనని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను కోర్టుకు లాగుతానని, పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా క్రీడాకారులకు తగిన సదుపాయాలు లేవని, వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత ప్రతి జిల్లాలో స్టేడియాలు ఉండేలా చూస్తారని హావిూ ఇచ్చారు. ప్రత్యేక ¬దా విూద చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు వైఎస్సార్సీపీ బంద్‌ను
అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అనంతరం ప్రార్థసారధి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల విూద చంద్రబాబుకు చిత్త శుద్ధి లేదన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేశాడని, ప్రజలను తప్పుదోవ పట్టించ దానికే ప్రధాని విూద ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, వైఎస్సార్సీపీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీచేస్తాయని చంద్రబాబు గోబెల్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ, బీజేపీతో కలసి పోటీ చేయదని వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అనేక సార్లు చెప్పాడని గుర్తు చేశారు. నేను చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి వైఎస్సార్సీపీ పోటీ చేస్తే నేను రాజకీయాలనుంచి విరమించుకొంటా.. కలసి పోటీ చేయకపోతే చంద్రబాబు తప్పుకుంటాడా అని పార్ధసారథి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు