క్రికెట్ నుంచి సంగక్కర నిష్క్రమణ

ss4wudsf15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్, 134 టెస్టులు, 12 వేల 400 పరుగులు, 182 క్యాచ్ లు, 20 స్టంపింగ్ లు..ఇది సంగాక్కరా ట్రాక్ రికార్డ్.. కీపర్ గా, బ్యాట్స్ మెన్ గా సూపర్ సక్సెస్ అయిన సంగక్కరా తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు.. కొలంబో వేదిక తన చివరి టెస్ట్ ఆడి అంతర్జాతీయ కెరీర్ కు ఘనంగా వీడ్కోలు పలికాడు.

ఇన్నాళ్లు లంక క్రికెట్ కు పెద్దదిక్కుగా ఉన్న సంగక్కరా ఓ సూపర్ బ్యాట్స్ మెన్ గా నీరాజనాలు అందుకున్నాడు.. తన కెరీర్ లో 38 టెస్ట్ సెంచరీలతో పాటు 51 అర్థసెంచరీ లు చేశాడు.. వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పిన సంగా.. కొలంబో టెస్ట్ లో తన 15 ఏళ్ల క్రికెట్ ప్రస్థానానికి పులిస్టాప్ పెట్టాడు.
తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఎన్నోసార్లు లంకను విజయతీరాలకు చేర్చిన సంగక్కర, లంక క్రికెట్ వైభవంలో తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాడు.. ఒంటిచేత్తో లెక్కలేనన్ని అద్భుత ఇన్నింగ్స్ లు ఆడి జట్టును ఆదుకున్నాడు.. ఎన్నోసార్లు జట్టు కష్ట కాలంలో ఉన్నప్పుడు క్రీజ్ లో పాతుకుపోయి లంకను ఆదుకున్నాడు.

సొగసైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అలరించిన సంగా… టెస్ట్ కెరీర్ ఓ మిరాకిల్.. 57.41 సగటుతో 12 వేలకు పైగా పరుగులు సాధించిన సంగక్కర.. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించి ఐదో బ్యాట్స్ మెన్ గా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు.. ప్రపంచ క్రికెట్ లో ఓ నిరార్సైన ప్లేయర్ గా అందరి మన్ననలు పొందాడు.
లంక తరఫున వన్డేలతో పాటు టెస్ట్ ల్లో అత్యధిక పరుగుల వీరుడు సంగక్కరే..రెండు ఫార్మాట్లలో కలిపి సంగక్కరా 26 వేలకు పైగా రన్స్ సాధించాడు. ఇక కీపర్ గా తిరుగులేని రికార్డున్న సంగా టెస్ట్ ల్లో 182 వికెట్లలో భాగం పంచుకున్నాడు.. లంక తరఫున ఎక్కువ క్యాచ్ లు పట్టిన రెండో ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు, బ్యాట్స్ మెన్ గా, కీపర్ గా, కెప్టెన్ గా సేవలు చేసిన సంగక్కర రిటైర్ మెంట్ లంక క్రికెట్ కు తీరని లోటే..అతని అల్ రౌండ్ ప్రతిభను మరిపించే అతని స్థానాన్ని లంక క్రికెట్ ఇప్పట్లో భర్తీ చేయడం కష్టమే.

15 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన మరో క్రికెట్ దిగ్గజం అస్త్రసన్యాసం చేసింది.. క్రికెట్ హిస్టరీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సాధించిన సంగా కెరీర్ కు ఎండ్ కార్డ్స్ పడింది.. ఎడమ చేతి బ్యాటింగ్ కు వన్నె తెచ్చిన సంగక్కరాకు గ్రాండ్ ఫేర్ వెల్.