క్రీడలతో మానసిక ఉల్లాసం, శరీరం దృడంగా మారుతుంది

– చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేషం గౌడ్
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 26 : క్రీడలతో మానసిక ఉల్లాసం, శరీరం దృడంగా మారుతుందని చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేషం గౌడ్ అన్నారు. 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం చేర్యాల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏఎంసీ సిబ్బంది, హమాలీ కార్మికులు కలిసి కబడ్డీ క్రీడా స్ఫూర్తిని చాటారు. గెలుపొందిన వారికి చైర్మన్ చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. మానసిక ఉల్లాసాన్ని పెంచడంతో పాటు శరీరాన్ని దృడంగా మార్చుతాయని, గ్రామీణ స్థాయిలో క్రీడాపోటీలను నిర్వహించి క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి, కార్యదర్శి గ్యాదరి పరమేశ్వర్, సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.