క్రీడలను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

క్రీడలకు ట్యూషన్ అవసరం :

బ్యాట్మెంటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్

మిర్యాలగూడ, జనం సాక్షి

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు క్రీడలను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని చీఫ్ నేషనల్ కోచ్ ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్, తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుల్లెల గోపీచంద్ అన్నారు.గురువారం మిర్యాలగూడ పట్టణం లోని హౌసింగ్ బోర్డ్ లో గల క్లియో స్పోర్ట్స్ అరేనాలో 8వ యోనెక్స్ సన్‌రైజ్ తెలంగాణ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ సబ్ జూనియర్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని,ఈ పోటీల ద్వారా గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు లభిస్తాయన్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను ఈ పోటీల ద్వారా వెలుగులోకి వస్తుందన్నారు.తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తెలుగు రాష్ట్రాలలో సుమారు 3000 కోచింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గత అయిదారు సంవత్సరాల క్రితం కేవలం 200 కోచింగ్ సెంటర్లు ఉండగా ప్రస్తుతం 3 వేల కోచింగ్ కేంద్రాల ద్వారా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారన్నారు. విద్యాభ్యసించే సమయంలో ఏ విధంగా సబ్జెక్టులకు ట్యూషన్ తీసుకుంటామో అదే తరహాలో క్రీడల పట్ల, క్రీడల నైపుణ్యం కోసం ట్యూషన్ పెట్టవలసిన అవశ్యకత ఉందన్నారు. విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి, సహకరించి ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీల నిర్వాహకులు, బ్యాట్మెంటన్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కోశాధికారి రంగా శ్రీధర్, బ్యాట్మెంటన్ అసోసియేషన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు,
మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, కౌన్సిలర్ ఉదయభాస్కర్,
బ్యాట్మెంటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామారావు, కోచ్ రామకృష్ణ, క్లియో స్పోర్ట్స్ అరేనా స్టేడియం నిర్వాహకులు, ఏచూరి శ్రీ హర్ష రాహుల్ తోపాటు ప్రముఖ న్యాయవాది ఏచూరి శ్రీనివాస్, ప్రముఖ రైస్ మిల్లర్ రంగా హరినాథ్, ఆన్సర్ భాష, క్రీడాకారులు, క్రీడాభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.