క్రీడల్లో ప్రోత్సాహంపై గ్రామీణ క్రీడా ప్రాంగణం
క్రీడ ప్రాంగణాన్ని ప్రారంభించిన సర్పంచ్:కొట్టెం సావిత్రి
కొత్తగూడ ఆగస్టు 17 జనంసాక్షి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంను బుధవారం రోజున కోనపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సావిత్రి వజ్జయ్య చేతుల మీదుగా ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ మన గ్రామం మన క్రీడా,యువకులకు ఖో-ఖో,కబడ్డీ,వాలీబాల్,లాంగ్ జంప్‌లో మెళకువలు నేర్చుకునేందుకు గ్రామీణ ప్రాంతంలో యువతీయువకులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవేందర్ రావు,ఎంపిటిసి స్వప్న లింగన్న,గ్రామ కార్యదర్శి వెంకట్ నాయక్,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,యూత్ సభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.