క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన మండల అధికారులు

 

కొత్తగూడ ఆగస్టు 11 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎంచగూడెం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా గ్రామస్థాయి క్రీడోత్సవాలను కొత్తగూడ మండల తహసిల్దార్ చందా నరేష్,ఎంపీడీవో భారతి,జడ్పిటిసి పుష్పలత,ఎంపీపీ విజయ ప్రారంభించారు.అనంతరం క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సురేష్ బాబు,ఎంపీఓ సత్యనారాయణ,గ్రామ సర్పంచ్ పుల్సం నారాయణ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ,కార్యదర్శి కవిలాల్,ఉపాధ్యాయులు,క్రీడాకారులు,విద్యార్థులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.