క్రెయిన్‌లో విద్యార్థుల కష్టాలు దౌత్య వైఫల్య
- సమయానికి ఆదుకోని నరేంద్ర మోదీ సర్కారు
నానా కష్టాలు పడి భారత్‌కు తిరిగొస్తున్న పిల్లలు - పుష్పగుచ్ఛాలు ఇస్తూ సర్కారు పెద్దల ఫొటోలు
- మండిపడుతున్న యుద్ధబాధిత విద్యార్థులు
న్యూఢిల్లీ, మార్చి 4: మహాశక్తిమంతులం కనుకనే మన విద్యార్థులను విజయవంతంగా వెనుకకు తేగలిగామని మోదీ సర్కారు చెప్పుకొంటున్నది. అష్టకష్టాలు పడి విద్యార్థులు భారత్ గడ్డ మీద అడుగుపెడితే వారికి కేంద్రమంత్రులు పుష్పగుచ్ఛాలతో స్వాగతాలు పలికి ఫొటోలు దిగుతున్నారు. ‘సకాలంలో స్పందించకుండా ఇప్పుడు ఈ పూలగుత్తులు మా చేతికి ఇస్తున్నారు. వీటిని ఏంచేసుకోవాలి?’ అని ఓ విద్యార్థి నిలదీసినప్పటికీ వారి ప్రహసనం ఆగట్లేదు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యేకంటే ముందే కీవ్ నుంచి పశ్చిమాన ఉన్న ల్వీవ్‌కు భారత రాయబార కార్యాలయాన్ని మార్చారు. నవంబర్‌లోనే భారత రాయబారిని హంగరీకి తరలించింది. రాయబార కార్యాలయాన్ని, రాయబారిని సురక్షిత ప్రాంతానికి తరలించినవారు విద్యార్థులను వెనుకకు రప్పించేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో సంక్షోభం బద్దలై పరిస్థితి చేయిదాటిన తర్వాతే భారతీయ విద్యార్థుల తరలింపు ఏర్పాట్ల గురించి మోదీ సర్కారు తాపీగా ఆలోచించిందని పలువురు మండిపడుతున్నారు.