క్లాస్‌రూమ్స్‌ డిజిటలైజేషన్‌సౌకర్యాల కల్పనకు ఆదేశాలు

ఏలూరు,నవంబర్‌11(జనం సాక్షి): జిల్లాలో పలు హైస్కూళ్లలో డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ ఏర్పాటు చేయాలని డిఇవో అన్నారు. పాఠశాలలకు అవసరమైన అదనపు తరగతి గదులు, కంప్యూటర్‌ రూమ్‌లు, లైబ్రరరీలకు అవసరమైన ఫర్నీచర్‌, అన్ని హైస్కూళ్లలో కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం అనంతరం ప్రాథమిక పాఠశాలలకు కాంపౌండ్‌ వాల్స్‌, ప్రతిస్కూల్‌లో డయాస్‌ల ఏర్పాటుతోపాటు మరుగుదొడ్ల ఏర్పాటు, రన్నింగ్‌ వాటర్‌, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం, ఫ్యాన్‌లు వంటి సౌకర్యాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నాడు నేడు కింద పాఠశాలను అభివృద్ది చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేశారని, మిగిలిన ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో దాతలను చైతన్యపరిచి రూ.45 వేలు సేకరిస్తే మిగిలిన సొమ్మును ప్రభుత్వం నుండి రప్పించి వచ్చే మార్చిలోగా డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేసి వాటిని వినియోగంలోనికి తీసుకురావాలని డిఇవో చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు సమగ్ర ప్రణాళిక  సిద్ధం చేస్తున్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో 46 శాతం మంది పౌష్టికాహారం లోపంతో ఉండటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కలెక్టర్‌ అన్నారు. దీన్ని అధిగమించడానికి విద్యార్థులతోపాటు ప్రతిఒక్కరూ మలమూత్ర విసర్జన అనంతరం, భోజనానికి ముందు కచ్ఛితంగా హ్యేండ్‌వాష్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు.  పాఠశాలల్లో సౌకర్యాలు లేనప్పటికి ఉన్నట్లుగా తప్పుడు నివేదికలిస్తే చర్యలు తప్పవని, ఇతర శాఖలకు చెందిన అధికారులను పాఠశాలలకు తనిఖీకి పంపిస్తామని తెలిపారు. `