క్లియర్ : ఎర్రంనాయుడు తనయుడి అరంగేట్రం
శ్రీకాకుళం : తన రాజకీయ రంగ ప్రవేశంపై చెలరేగుతున్న ఊహగానాలకు తెలుగుదేశం దివంగత నేత ఎర్రంనాయుడి కుమారుడు రామ మనోహర్ నాయుడు తెర దించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అయన శుక్రవారం తేల్చి చెప్పారు. తన తండ్రి అశయాలకు అనుగుణంగా పనిచేస్తానని అయన చెప్పారు.రాజకీయ పరిమితి సాదించే వరకు పెద్దల సహకారం తీసుకుంటానని అయన అన్నారు. తన తండ్రి ఎర్రంనాయుడు బాబాయ్ అచ్చెంనాయుడి మాదిరిగా ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని అయన చెప్పారు. అయన శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి ఎర్రనాయుడునాలుగు సార్లు ప్రాతినిద్యం వహించారు. గత ఎన్నికల్లో అయన కాంగ్రెసు తరపున పోటీ చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ రామయనోహర్ నాయుడిని పార్టీ అడిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇరవై ఏడెళ్ల రామమనోహర్ నాయుడు లండన్‌లో చదువుకుంటున్నాడు. రామమనోహర్ నాయుడు శాసనసభకు పోటీ చేస్తానంటే మాజీ శాసనసభ్యుడు అచ్చెంనాయుడిని లోక్‌సభ స్థానం నుంచి రంగంలోకి దించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.