క్వారీ యజమానులపై చట్టపరమైన చర్య: రాజప్ప

అమరావతి,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): కర్నూలు జిల్లాలో క్వారీ పేలుళ్ళ ఘటన దురదృష్టకరమని ¬ంమంత్రి చినరాజప్ప అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ క్వారీ యజమానులు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇతర రాష్టాల్ర నుంచి వలస వచ్చే కూలీల భవిష్యత్‌పై దృష్టి సారిస్తామని అన్నారు. క్వారీ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చినరాజప్ప తెలిపారు.ఇదిలావుంటే హత్తిబెళగల్‌ క్వారీ ప్రమాద ఘటనలో గాయపడిన వారిని వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, ప్రాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, రాష్ట్ర కార్యదర్శులు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, గౌర వెంకట్‌ రెడ్డిలు బాధితులను కలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆలూరు నియోజకవర్గంలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. క్వారీ నిర్వాహకుడు టీడీపీ సానుభూతిపరుడు కావడం వల్లే అధికారులు అనుమతులిచ్చారని వైఎస్సార్‌ సీపీ నేతలు ఆరోపించారు. మరణించిన వారికి ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

 

తాజావార్తలు