క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం
కొత్తగూడ జూలై 20 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శ్రీ గుంజేడు ముసలమ్మ సహకార పరపతి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పులసం శాంత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఏపీఎం రగోతం రెడ్డి మాట్లాడుతూ క్షయ వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సరోజ మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలు,మందులు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.టీబీ యొక్క లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు,జ్వరము,బరువు తగ్గడం,ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కలిగిన వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని అన్నారు.ప్రతి ఒక్కరు టీబి పై అవగాహన కలిగి ఉండాలని టీబి ని అంతంచేయడం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే టీబి వ్యాధి తగ్గుతుందని అన్నారు.అనంతరం మహిళా సంఘాలతో 2025 నాటికి కి దేశం లో టీబీ ని అంతం చేయాలని వారితో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏసీ స్ ఎం కోఆర్డినేటర్ అశోక్,ఎస్ టి యస్ భాస్కర్,బి టీ బి కోఆర్డినేటర్ వెంకట్, మండల సమైక్య సీసీలు,వివో ఏలు,వివిధ స్వయం సహాయక సంఘాల అధ్యక్షురాలు పాల్గొన్నారు