క్షయ వ్యాధి పై అవగాహన కార్యక్రమం
దంతాలపళ్లి జూలై 26 జనం సాక్షి
స్థానిక మండల కేంద్రానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మహబూబాద్ జిల్లా క్షయ నివారణ విభాగం, బ్రేకింగ్ ద బ్యారియర్స్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి.విజయ రెడ్డిమాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే దగ్గరలో వున్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి ఉచిత వైద్య సేవలు అందుకోవాలని, మహబూబాద్ జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ తమవంతు సహాయ సహకారాలు అందించాలని,టీబీ వ్యాధిపై అందరూ అవగాహన కలిగి వుండాలనీ,2025 వ సంవత్సరం నాటికి మహబూబాద్ జిల్లా ను క్షయ రహిత జిల్లాగా సామాజిక సంఘాల సహాయంతో సాధించాలని పేర్కొన్నారు.
అంతేకాకుండా టీబీ అంతం మనందరి పంతం కావాలని, దీనికోసం సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని,
క్షయ వ్యాధి అనేది గ్రామాల్లో ఎక్కువగా వుండే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలలో మహిళా సంఘాలు ,స్వచ్ఛంద సేవ సంస్థలు మరింత చురుగ్గా టీబీ నిర్మూలన లో పనిచేయాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీబీ నోడల్ సూపర్వైజర్ చలపతిరావు,ల్యాబ్ సూపర్వైజర్ సందీప్, ఏఎన్ఎంలు సుభద్ర, కళావతి,ఆశా కార్యకర్తలుసరస్వతి, విమల,సైదమ్మ బ్రేకింగ్ ద బ్యారియర్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రశాంత్, తదితరులు
పాల్గొన్నారు.