‘ఖని’లో అగ్ని ప్రమాదం
గోదావరిఖని : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని లక్ష్మీనగర్ ఆంధ్రాబ్యాంక్ శాఖలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఇన్వర్టర్ బ్యాటరీలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కంప్యూటర్లకు అంటుకున్నాయి. బ్యాంక్ లోంచి పొగలు రావడాన్ని గమనించి స్థానికులు అగ్నిమాకపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే ఖాతాదారుల సమాచారం భద్రంగా ఉందని బ్యాంక్ అధికారులు తెలిపారు.