ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్..
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా ప్రారంభమైంది. ఖమ్మం – వరంగల్ – నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక ఆదివారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నుండే ఓటర్లు బారులు తీరి నిలుచున్నారు. జిల్లా వ్యాప్తంగా 84,284 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు గాను జిల్లాలో 79 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 44 యాగ్జలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 123 పోలింగ్ కేంద్రాలకు గాను 122 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ అందుబాటులో ఉంచనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడుగురు డీఎస్పీ ఆధ్వర్యంలో 850 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక రెండు సీఆర్పీఎఫ్ దళాలు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికలో 40 శాతం నమోదు కాగా ఈసారి ఎంత మేర ఓటింగ్ నమోదవుతుందనే ఆసక్తికరంగా మారింది.