ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం

CM KCR goes to Khammam

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే రాములోరి కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. రాముల వారి కళ్యాణానికి సీఎం పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కళ్యాణోత్సవం అనంతరం మణుగూరులో 1,080 మెగావాట్ల పవర్‌ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.