ఖరీఫ్‌లోపు కాలువల ఆధునీకరణ
కరీంనగర్,మార్చి3(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ రోళ్లవాగు, బొల్లి చెరువు ఆధునికీకరణ పనులకు సంబంధించి హావిూ ఇచ్చారని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల సర్వే పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. బొల్లి చెరువుకు సంబంధించి పూర్తి నివేదిక ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. మిషన్ కాకతీయతో పాటు ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అత్యంత ఆసక్తితో ఉన్నారని అన్నారు. ఎస్సారెస్పీ పరిధిలో ఆయా ప్రాజెక్టుల్లోని పూడికను అధికారుల అనుమతితో రైతులు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం జరుగుతున్న కాకతీయ కాలువల మరమ్మతు పనులు వచ్చే ఖరీఫ్‌లోపు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్య ఇంజినీరు పేర్కొన్నారు. ఎస్సారెస్పీ పరిధిలోని డీ-83, డీ-86 కాలువలకు తాగునీటిని సరఫరా చేస్తుండటంతో పాటు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పెల్లి మున్సిపాల్టీలకు కూడా తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ 14.5 టీఎంసీలు, ఎల్‌ఎండీలో 6.85 టీఎంసీల నీరు నిల్వ ఉండగా కేవలం తాగునీటి అవసరాలకే ఈ నీటిని వినియోగిస్తామని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ క్వార్టర్లలో అనధికారికంగా నివాసం ఉంటున్న వారితో పాటు విశ్రాంత ఉద్యోగులను ఖాళీ చేయిస్తామని పేర్కొన్నారు.