ఖానాపురం మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు
ఖానాపురం అక్టోబర్ 23జనం సాక్షి
ఖానాపురం మండల ప్రజలకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపినబిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావుతెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయమ‌న్నారు.సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం, కేదారీశ్వర వ్రతాలు చేయ‌డం కూడా దీపావళి పండగ విశిష్టత అన్నారు. ప్రజలందరు పండుగ‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌ని, పటాకులు కాల్చేట‌ప్పుడు జాగ్రత్తలు తీసుకొవాల‌ని వారు సూచించారు.