ఖుర్షీద్‌, లీ పర్యటనల ఖరారుపై కొనసాగుతున్న చర్యలు

బీజింగ్‌, జనంసాక్షి: మే 7: విదేశాంగ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ బీజింగ్‌, చైనా ప్రధాని కెక్వియాంగ్‌ ఢిల్లీ పర్యటనలపై భారత్‌-చైనా చర్చలు జరుపుతున్నాయి. ఆదివారం ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు ఉపశమించడంతో నేతల పర్యటనలపై దౌత్యవేత్తలు చర్చలు ప్రారంభించారు సల్మాన్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు కాలేదని విదేశీ వ్యవహారాల అధికారులు వెల్లడించారు ఖుర్షీద్‌ పర్యటనలోనే చైనా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లీ తొలి విదేశీ పర్యటనకు భరత్‌ను ఎంచుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని భావిస్తుండగా దౌలత్‌బేగ్‌ ఓడ్డీ సంఘటనతో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. డీవోబీనుంచి చైనా వైదొలగిన అనంతరం  భారతసైన్యం వాస్తవాధీన సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన ముమ్మరం చేస్తునన్నది. మరోసారి ఇలాంటి ఘటనలు తలెత్తకుండా గస్తీ ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రల్లో శిఖరారోహణ దళాల ఏర్పాటు వైమానిక దళ స్థావరాలు నెలకొల్పడానికి ప్రభుత్వం 84వేలకోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నది.