గజ గజ వనికిస్తున్న చలి పులి

 

హైదరాబాద్‌: రాష్ట్రప్రజలను చలిపులి గజగజలాడిస్తుంది. చాలా ప్రాంతాల్లో సాధరణం కంటే రెండు నుంచి 7ఢీగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా విశాఖ ఏజెన్సీప్రాంతం లంబసింగిలో 4డిగ్రీల రాత్రిపూట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ, రాయలసీమల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోగా కోస్తాంద్రలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తెలంగాణ రాయలసీమల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4నుంచి 7ఢిగ్రీల వరకు నమోదుకాగా, కోస్తాంధ్రలో 2నుంచి 6ఢిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి. ఏజెన్సి ప్రాంతాల్లో 7నుంచి 9ఢిగ్రీల వరకు తగ్గిపోయాయి. చలి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ ఏజెన్సి ప్రాంతం లంబసింగిలో 4ఢిగ్రీలు, చింతపల్లిలో 6డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని మెదక్‌లో అత్యల్పంగా 9, మహబూబ్‌నగర్‌లో 14డిగ్రీలు, రాయలసీమలోని కర్నూలు 14, కడప 15, తిరుపతి 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.