గజ తుఫాన్‌పై అధికారుల అప్రమత్తం

చిత్తూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): గజ తుఫాన్‌ పై అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్‌ ప్రద్యుమ్న పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలోని 26 మండలాల్లో గజ తుఫాన్‌ ప్రభావం ఉంటుందని చెప్పారు. ప్రతి మండలంలో ఐదుగురు ప్రభుత్వ ఉన్నతాధికారులను పర్యవేక్షణ కోసం నియమించామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో గజ తుఫాన్‌ ప్రభావం ఉన్న 26 మండలాల్లో రేపు (శుక్రవారం) ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించామని, గజ తుఫాన్‌ రేపు సాయంత్రానికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు.