గడువు పొడిగింపు
ఆదిలాబాద్, నవంబర్ 9 : జిల్లా ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్ల భర్తీకి దరఖాస్తులు సమర్పించుకోవడానికి ఈ నెల 14వ తేదీవరకు గడువు పొడిగించినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దరఖాస్తులు అందజేసేందుకు ఈ నెల 5వ తేదీ వరకు గడువు ఉండగా, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 14 వరకు గడువును పొడిగించారు. జిల్లా ఎక్సైజ్ శాఖలో ఉన్న 137 పోస్టులకు గాను ఇప్పటి వరకు 22,687 దరఖాస్తులు వచ్చాయి. గడువు పెంచడంతో మరో 7, 8 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు తమ సమీప మీ సేవ కేంద్రాలను సంప్రదించాలని అధికారులు తెలిపారు.