గణపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!
భూపాలపల్లి ప్రతినిధి ఆగస్టు 7 (జనం సాక్షి )జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోనిగణపురం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల లో 1987- 88 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు దాదాపు గత 34 సంవత్సరాల తర్వాత తాము చదువుకున్న పాఠశాల ఎవరెవరు ఎక్కడ అ ఏం చేస్తున్నారు అని మండల కేంద్రంలోని జడ్పీ పి ఎస్ ఎస్ ఆవరణలో ఆదివారం స్థానిక సర్పంచ్ నార గాని దేవేందర్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో దాదాపు 100 మంది పాల్ల్గొన్నారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం లో ఎవరెవరు ఏం చేస్తున్నారో అని వారి తీరుతెన్నులను నెమరు వేసుకుని బాగోగులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బూరరమేశ్ గౌడ్ , శ్రీధర్ రెడ్డి ,నారాయణ ,వేణు ,చక్రపాణి ,మల్లయ్య , అమర్నాథ్, సుధాకర్ ,నీరజ ,ఊర్మిళ ,కమల సరస్వతి ,రమాదేవి, సువర్ణ రమేష్ ,వెంకట్ రెడ్డి ,హఫీజ్ ,రబ్బాని, రవి తదితరులు పాల్గొన్నారు.
|