గణెళిష్‌నిమ్‌జ్జనంతో ట్రాఫిక్‌ మల్లింపు చర్యలివే…

-రూరల్‌ ఎసిపి తిరుపతి

కరీంనగర్‌,. సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):గణెళిష్‌ నిమజ్జనం సందర్బంగా ఈనెల 3 వతేదీన కరీంనగర్‌ రూరల్‌ డివిజన్‌ పరిదిలో దారి మల్లింపు చర్యలు తీసుకుంటున్నామని రూరల్‌ ఎసిపి తిరుపతి తెలిపారు. మానకొండూర్‌ చెరువు, చింతకుంట ఎస్సారెస్పీ కాలువల వద్ద జరిగే నిమజ్జనం ప్రాంతాల్లో ఈ దారిమల్లింపు చర్యలుంటాయన్నారు. మానకోండూర్‌ చెరువు వద్ద నిమజ్జనంకు వచ్చే వాహనాలు భక్తులు నిమజ్జనం తర్వాత వాహనాలతో మానకొండూర్‌ చౌరస్తానుంచి ముంజంపల్లి పోరండ్ల తిమ్మాపూర్‌, పోరండ్ల గ్రామాల విూదుగా రాజీవ్‌రహదారి మార్గానికి చేరుకుని కరీంనగర్‌ వెల్లాలన్నారు. వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వెల్లే వాహనాలు మానకొండూర్‌ చౌరస్తానుంచి ముంజంపల్లి పోరండ్ల తిమ్మాపూర్‌ గ్రామాల విూదుగా రాజీవ్‌ రహదారి మార్గానికి చేరుకుని కరీంనగర్‌ వెల్లాల్సి ఉంటుందన్నారు వేముల వాడ, సిరిసిల్ల నుంచి వచ్చే వాహనాలు వడ్డేపల్లిగ్రామం వద్ద ఎడమ వైపునకు తిరిగి మల్కాపూర్‌ శాతవాహన

యూనివర్శిటీ రేకుర్తి క్రాస్‌ రోడ్‌ ల విూదుగా కరీంనగర్‌ వెల్లాల్సి ఉంటుందన్నారు. ప్రజల సౌకర్యార్థం భారీ వాహనాల యజమానులు తమ వాహనాలను సెప్టెంబర్‌ 3న మద్యాహ్నం 12 గంటలనుంచి 4వతేదీ ఉదయం 10గంటలవరకు ఇంటిలేదా సవిూపంలో గల ఖాళీ స్థలంలో నిలుపుదల చేయాలని ఆయన కోరారు. బక్రీద్‌ పర్వదినం సందర్బంగా దారిమల్లింపు చర్యలివే… ఃకవిూషనర్‌ విబి కమలాసన్‌ రెడ్డి

బక్రీద్‌ పర్వదినం సందర్బంగా నేడు 2వతేదీన కరీంనగర్‌లో దారిమల్లంపు చర్యలుతీసుకోవడం జరిగిందని పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి తెలిపారు. ముస్లిం సోదరులు ప్రార్థనలకు అసౌకర్యం కలుగకుండా ఈచర్యలు తీసుకున్నామన్నారు. దారిమల్లింపులో బాగంగా జగిత్యాలనుంచి వచ్చే వాహనాలు రేకుర్తి క్రాస్‌ రోడ్‌ శాతవాహన యూనివర్శిటీ చింతకుంట పద్మనగర్‌ విూదుగా బస్‌స్టాండ్‌కు చేరుకోవాలన్నారు. చొప్పదండివైపునుంచి వచ్చే వాహనాలు నాఖా చౌరస్తా, పెద్దపల్లి ప్లైఓవర్‌ బద్దం ఎల్లారెడ్డి విగ్రహం గణెళిష్‌నగర్‌ బైపాస్‌ రోడ్డు అంబేద్కర్‌ స్టేడియం, భగత్‌ నగర్‌ ప్రశాంత్‌లాడ్జ్‌ విూదుగా బస్‌ స్టాండ్‌ చేరుకోవాలన్నారు. పెద్దపల్లి గోదావరిఖని నంచి వచ్చే వాహనాలు బద్దం ఎల్లారెడ్డి విగ్రహం గణెళిశ్‌నగర్‌ బైపాస్‌ అంబేద్కర్‌ స్టేడియం భగత్‌నగర్‌ ప్రశౄంత్‌ లాడ్జ్‌ విూదుగా బస్‌ స్టాండ్‌లోకి చేరుకోవాలన్నారు. హైదరాబాద్‌,వరంగల్‌ నుంచి వచ్చే వాహనాలు గణెళిష్‌నగర్‌ బైపాస్‌ అంబేద్కర్‌ స్టేడియం, భగత్‌ నగర్‌ ప్రశాంత్‌లాడ్జి విూదుగా బస్‌ స్టాండ్‌కు చేరుకోవాలన్నారుపన హైదరాబాద్‌ వరంగల్‌నుంచి వస్తూ పెద్దపల్లి గోదావరిఖని చొప్పదండి వెల్లే వాహనాలు బద్దం ఎల్లారెడ్డి విగ్రహం పెద్దపల్లి ప్లైఓవర్‌, నాఖా చౌరస్తా విూదుగా వెల్లాలన్నారు. హైదరాబాద్‌వరంగల్‌ నుంచి వస్తూ జగిత్యాల సిరిసిల్ల వైపు వెల్లే వాహనాలు ఎన్‌టీఆర్‌ విగ్రహం పద్మనగర్‌ బైపాస్‌ చింతకుంట క్రాస్‌ రోడ్‌ శాతవాహన యూనివర్శిటీ రేకుర్తి క్రాస్‌రోడ్‌ విూదుగా వెల్లాలన్నారు. సిరిసిల్లనుంచి వస్తూ చోప్పదండి పెద్దపల్లి గోదావరిఖని హైదరాబాద్‌, వరంగల్‌ వైపుకు వెల్లే వాహనాలు పద్మనగర్‌ బైపాస్‌ ఎన్టీఆర్‌ విగ్రహం, బద్దం ఎల్లారెడ్డి విగ్రహం పెద్దపల్లి ఫ్లైఓవర్‌ నాఖాచౌరస్తా విూదుగా వెల్లాల్సి ఉంటుందని కవిూషనర్‌ వెల్లడించారు. శనివారం ఉదయం 7 గంటలనుంచి ముస్లింల ప్రార్థనలు పూర్తయ్యేవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కొరారు.