గణేష్ నిమజ్జనానికి గోదావరి ప్రాంతాన్ని పరిశీలించిన డి.ఎస్.పి..

ధర్మపురి ( జనం సాక్షి) పదకొండురోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథునికి, వీడ్కోలు పలికే కార్యక్రమమైన నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి సూచించారు.డి.జే సౌండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం జరగదు. కావున డి.జే ఉపయోగించరాదు. మిక్చర్, వూఫెర్ లేని (1) లేదా (2) సౌండ్ బాక్స్ లు ఉపయోగించుకోవచ్చు.
ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు దారిలో అడ్డుగా ఉన్న స్థలాల్లో కర్రలతో వాటిని జరిపే సమయంలో విద్యుత్ షాక్ కు గురయ్యే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించగలరు.
ఒక ఊరేగింపు వెళ్తున్న క్రమంలో దానిని దాటి వేరేవాళ్లు పోయే ప్రయత్నం చేసినప్పుడు వారికి అడ్డుగా వుండరాదు. పక్కకు జరిగి వారు వెళ్ళుటకు సైడ్ ఇవ్వవలెను. వారితో ఘర్షణకు దిగారాధు.
ఇతర వర్గాలను గాని మతాలు గాని వ్యక్తులను గాని లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేయరాదు, పాటలు పాడవవద్దు.
ఇతర మతస్తుల ప్రార్ధనా స్థలాల వద్ద ఆగి ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నినాదాలు చేయరాదు.
కేవలం గణనాథుడి భక్తి పాటలు మాత్రమే పాడుతూ ఊరేగింపులో పాల్గొన వలెను,మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో ఊరేగింపులో పాల్గొనరాదు.గణనాథుని నిమజ్జనం సమయంలో నీటి లో మునిగి పోయే అవకాశం ఉంటుంది. కావున ఈత రాని వ్యక్తులు, పిల్లలు దూరంగా గట్టుదగ్గరే ఉండి పెద్ద వాళ్ళు మాత్రమే నిమజ్జనం చేయవలెను.ఎటువంటి గొడవలు వివాదాలకు పాల్పడ రాదు.
ఉత్సాహం శృతి మించితే, ప్రవర్తన అదుపు తప్పితే చట్టం తనపని తాను చేసుకు పోతుంది. కావున అప్రమత్తంగా ఉండగలరు.
మనసునిండా భక్తితో నిమజ్జనం చేద్దాం – మరపురాని తీపి జ్ఞాపకంగా ఈ వేడుకలు గుర్తుంచుకుందామని వారు సూచించారు. ఈ పర్యవేక్షణలో తహశీల్దార్ కృష్ణ చైతన్య, మున్సిపల్ కమిషనర్ రమేష్, మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సతే మ్మ , సిఐ రమణమూర్తి ఎస్సై దత్తాద్రి మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న ఆర్ ఐ మరియు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.