గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలి * ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఉత్సవ కమిటీ వారే బాధ్యతవహించాలి * టేకులపల్లి ఎస్సై రమణారెడ్డి సూచన

టేకులపల్లి, సెప్టెంబర్ 26( జనం సాక్షి ): గణేష్ నిమజ్జన శోభాయాత్రను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని టేకులపల్లి ఎస్సై రమణారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా వినాయక మండపాల ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పలు సూచనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలపై మ్యూజికల్ సిస్టమ్స్‌తో పాటు డీజేలు పెట్టడానికి ఎటువంటి అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా డీజే లను పెడితే అట్టి గణేష్ కమిటీ పై చట్టరీత్య చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు.
విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలపై మద్యం మత్తులో ఉన్నవారిని అనుమతించకూడదు. రెచ్చగొట్టే నినాదాలు చేయడం, మత స్థలాల దగ్గర ఊరేగింపులను ఆపడంవంటివి చేయరాదన్నారు. ప్రతి విగ్రహం సాయంత్రం 6 గంటల లోపు నిమజ్జనం జరగాలి. చిన్నపిల్లలు, పెద్దవారిని నిమజ్జనం సమయంలో తీసుకొని వెళ్ళకూడదు. వాహనాలపై పరిమితికి మించి వెళ్ళకూడదు. ఊరేగింపు సమయంలో కరెంటు తీగలను గమనించి వాహనాన్ని నడపాలి. నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయకూదన్నారు. వాహనాలకు తగిన దారి ఉండేలా ఉత్సవ కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపులో పాల్గొనేవారు కర్రలు, కత్తులు,తుపాకీలు, మండే పదార్థాలు ఇతర ప్రమాదకరమైన వస్తువులు వంటి ఏ విధమైన ఆయుధాలను తీసుకెళ్లడం కూడా నిషేధించబడింది. ఊరేగింపులో భాగంగా ఎటువంటి గొడవలు కొట్లాటలు జరిగిన ఆ కమిటీ అందరూ భాధ్యత వహించవలసి ఉంటుందన్నారు.టేకులపల్లి మండలం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటికి గణేష్ మండప ఆర్గనైజర్స్ భాధ్యత వహించి ఉండాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ సర్పంచ�