గద్వాలలో సత్యశోధక్ సమాజ్ 150వ అవతరణ దినోత్సవం
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 25 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లోని బహుజన సేన ఆధ్వర్యంలో సత్యశోధకు సమాజ్ 150 అవతరణ దినోత్సవ సందర్భంగా ఆదివారం మహాత్మ జ్యోతిరావు పూలే గ్రహానికి పూలు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా న్యాయవాది మండ్ల మధుసూదన్ బాబు మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం ప్రజ్వలిస్తున్న వెలుగును సూచిస్తూ మహా దివ్యమైన తేజస్సుతో మహారాష్ట్రలోని పూనే పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో గోవిందరావు పూలే చిన్నబాయి దంపతులకు 1827 సంవత్సరం మే 11న జన్మించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జన్మించిన నాటికి బ్రాహ్మణ పూజారి వర్గం దుర్మార్గమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అర్థం పడటం లేని ఆచారులతో శూద్ర సమాజాన్ని దోపిడీ చేస్తున్న వైనం కర్మ సిద్ధాంతాన్ని అడ్డుపెట్టుకొని శూద్రులను కట్టు బానిసలుగా మార్చేశారనీ, విద్యాసంపద అధికారం ఆయుధం భూమి మొదలుకొని సమస్త వనరులు బ్రాహ్మణ అధిపత్యంలో ఉండేదనీ,ఎలాంటి హక్కులు ఉండేవి కావు కనీస మానవ హక్కుల కూడా నిషేధించబడ్డాయనీ, ఈ తరుణంలో పూలే జన్మించాడనీ, బ్రిటీష్ ప్రభుత్వం కల్పించిన విద్యా సౌకర్యాలు నేపథ్యంలో జ్యోతిరావు పూలే ఆంగ్ల విద్యను అభ్యసించి అవకాశం లభించిన ధర్మిల సామాజిక వివక్షత అన్యాయాలు మతపేరిట జరుగుతున్న అరాచకాలు పూలేని కలిసి వేసాయి థామస్ పెయిన్ రచించిన మానవ హక్కుల అనే గ్రంథం చే తీవ్ర ప్రభావితుడయ్యాడనీ, అలాగే జాన్స్ స్టువర్ట్ మిలు వాషింగ్టన్ శివాజీ వంటి వారి జీవితాలు మధ్యాహ్నం చేసి వారి స్ఫూర్తితో సామాజిక అణచివేతలపై తిరుగుబాటు చేయడం నిర్ణయించు కున్నాడనీ,అంతేకాకుండా ఒక బ్రాహ్మణ బాల్య స్నేహితులు వివాహమా వివాహంలో అవమానానికి గురై పూలే మొత్తం కుల వ్యవస్థకు తిరుగుబాటు లేవదీశాడనీ, మహాత్మారావు జ్యోత పూలే స్త్రీలకు సమాన విద్యా కావాలని బాల్యవివాహాలు రద్దు చేసి మహిళల విద్య కొరకు ఎన్నో హాస్టల్స్ నిర్మించడం జరిగిందనారు.
ఈ కార్యక్రమంలో బహుజన సేన జిల్లా అధ్యక్షులు దానయ్య, ఉపాధ్యక్షులు రాజు, వినోద్, డీజే నరేష్, జయరాజ్,నాగేష్,రాము, కాలేబు,విజయ్ తదితరులు పాల్గొన్నారు.