గర్భవతులు పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలి.
డాక్టర్ బోనాసి ఆలోచన
బిజినేపల్లి, సెప్టెంబర్ 19 జనం సాక్షి: గర్భవతులు ఆకుకూరలు, క్యారేట్, బిట్రూట్ వంటి పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్ బోనాసి ఆలోచన సూచించారు. సోమవారం మండల మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలో బాలవికాస సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంల్లో ఉచిత ఆరోగ్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భవతులకు పరీక్షలు. నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతోపాటు తగు సూచనలు సలహాలు అందించారు. పోషకవిలువలుగల ఆహారం తీసుకోవడం వలన రక్తహీనత లేకుండా కా పాడుకోవచ్చని దానివలన గర్భవతులకు సాధారణ ప్రసవం జరుగుతుందని తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ సుగుణమ్మ, ఉపసర్పంచ్ నాగేందర్, ఎంపి హెచ్ఎస్ఈఓ రాజేష్, పిహెచయం చంద్రకళ, ఎఎన్ పద్మ, యాదమ్మ, ఆ శాకార్యకర్తలు లక్ష్మి, పుష్ప, బాలవికాస కోఆర్డినేటర్స్ హేమలత. రామేశ్వరితోపాటు తదితరులు పాల్గొన్నారు.