గర్భిణులతో సమస్యలపై చర్చించిన కమిషనర్‌

విజయనగరం,నవంబర్‌24(జ‌నంసాక్షి): సాలూరులోని వైటిసిలో కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ శనివారం పర్యటించారు. సాలూరు గుమ్మడంలోని గర్భిణులను సందర్శించి వారితో మాట్లాడారు. అనంతరం అరుణ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు పౌష్టికాహారం లోపించిందన్నారు. ప్రభుత్వ పథకాలు ఎన్ని పెట్టినా శిశు మరణాలు ఆగడం లేదని, ఫీడర్‌ అంబులెన్స్‌ పెట్టినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో సర్వే చేయాలన్నారు. గిరిజనుల పట్ల బాధ్యతగా వ్యవహరించి, సమయానికి గిరిజనులకు పాలు, గుడ్లు, పౌష్టికాహారం అందిస్తూ, వైద్యాన్ని కూడా సమయానుకూలంగా అందించే చర్యలు చేపడతామని తెలిపారు. గిరిజనుల పౌష్టికాహార సర్వే నిర్వహించేందుకే ఈ రోజు సాలూరు వైటిసిలో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు.