గళ గళముణా జనగణ మన…!

 

జిల్లా వ్యాప్తంగా వేడుకల జాతీయ గీతాలాపన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 16 (జనం సాక్షి). స్వాతంత్ర భారత భద్రాచలం పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజలు పాల్గొన్నారు. గళ గళ మునా జాతీయ గీతాలపన చేస్తూ స్ఫూర్తిదాయకంగా వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని కొత్తచెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ రాహుల్ హెక్టే తో పాటు పలువురు విద్యార్థులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో అదరపు కలెక్టర్ కీమ్యా నాయక్ తో పాటు అధికారులు కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొని జాతీయ గీతాలపన చేశారు. మూడో వార్డులో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి తో పాటు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి స్థానిక కాలనీవాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 11 గంటల 30 నిమిషాలకు జిల్లా కేంద్రంలోని ఎక్కడికక్కడ ప్రధాన కూడళ్ళు పాఠశాలలు వ్యాపార వాణిజ్య కేంద్రాల వద్ద స్థానికులు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.