గాందీ ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం

గుంటూరు,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): గాంధీజీ 150 వ జయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు రైల్వేస్టేషన్‌లో సోమవారం గాంధీజీ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం ఎపి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ చేతుల విూదుగా ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ కోడెల మాట్లాడుతూ.. మాహాత్మా గాంధీ జీవితమే జాతికి గొప్ప సందేశమన్నారు. గాంధీజీ అహింసా మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్యం/-ర సాధించారని, అందరికీ అది ఆదర్శం కావాలని సూచించారు. అనంతరం అరకు ప్రాంతంలో హత్యకు గురైన సర్వేశ్వరావు, సోము కుటుంబాలకు స్పీకర్‌ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌తో పాటు ఎంపి రవీంద్ర, ఎమ్మెల్సీ రామకఅష్ణ, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు