గాంధీ చిత్ర ప్రదర్శన విజయవంతం
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు మహాత్మా గాంధీ సినిమా ఉచితంగా చూసేందుకు ఏర్పాటు చేసినందున ఈ రోజు జిల్లాలోని 9 థియేటర్ లలో 3,951 మంది విద్యార్థులు చలన చిత్రాన్ని తిలకించిన్నట్లు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని 9 సినిమా థియేటర్ లలో ఎటువంటి అంతరాయం లేకుండా మహాత్మగాంధీ చలన చిత్రాన్ని చూపిస్తూన్నట్లు , చలన చిత్రాల ప్రదర్శన మొదలైనప్పటి నుండి ఈ రోజు వరకు 19, 147 మంది విద్యార్థులు మహాత్మా గాంధీ చలన చిత్రాన్ని తిలకించిన్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు మంచిగా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు.ఈ చలన చిత్ర ప్రదర్శనలో డి ఈ ఓ , డీపీరో , ఎం ఈ ఓ లు, కో ఆర్డినేటర్ , వివిధ పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు , ఉపాధ్యాయులు, సంభందిత సిబ్బంది అందరూ సక్రమంగా విధులు నిర్వహిస్తూ చలన చిత్ర ప్రదర్శనలో ఎటువంటి అంతరాయం లేకుండా పర్యవేక్షిస్తున్నారని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.