గాంధీ విగ్రహం కు వినతి పత్రం అందజేసిన విఆర్ఏ లు ..
కరకగూడెం,ఆగస్టు16(జనంసాక్షి): తహసీల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏ ల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె 23 రోజుకూ చేరింది. ఈ సందర్భంగా వారు మండలం లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం కు సమస్య ల వినతిపత్రం సమర్పిచి , గ్రామము లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో విఆర్ఏ ల మండల అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని ఏ ఒక్క రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి లేదని ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కుదించి మిగతా శాఖల ఉద్యోగస్తులను సర్దుబాటు చేస్తున్నారని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తోటే ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణ జరుగుతుందని వారు చాలిచాలని వేతనాలు తోటే బ్రతుకు వెళ్లదీయాల్సి వస్తుందని పెరిగిన ధరలకు అనుగుణంగా జీతా భత్యాలు కుటుంబాన్ని పోషించడానికి కూడా సరిపోవడంలేదని వారన్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మరియు ప్రగతి భవన్లో చేసిన ప్రకటనకు కట్టుబడి పే-స్కేల్ జీవోను విడుదల చేసి తక్షణమే అమలు పరచాలని డిమాండ్ చేశారు .