గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం
గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం
సంగారెడ్డి టౌన్ చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు గురువారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు మహారాష్ట్రలోని సాంగ్లిలో చెరకు రైతుల ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో మృతిచెందిన రైతులకు శ్రద్థాంజలి ఘటించారు ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ చెరుకు మద్దతు ధర కోసం పోరాటం చేస్తున్న రైతుల పై పోలీసులు కాల్పులు జరపటాన్ని తప్పుపట్టారు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో మరోసారి రైతు సంఘాలు పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు నిర్వహించి మద్థతు ధర నిర్ణయించాని కోరారు కార్యక్రమంలో నాయకులు రామచంద్రారెడ్డి,మాధవరెడ్డి,గోపాల్,శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.