గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పంపు పై సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం
-ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవి నాయక్
కురవి సెప్టెంబర్-21
కురవి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ గిరిజనులకు (ఎస్టి)10 శాతం రిజర్వేషన్, పోడు భూములు సమస్యలు పరిష్కారం చేస్తారని, త్వరలో గిరిజన బంధువు కూడా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన శుభసందర్బంగా గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డియస్ రెడ్యానాయక్ ఆదేశానుసారం ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవినాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్,ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర యువజన నాయకులు రవి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ సీఎం చేయని పనులు, గిరిజన రిజర్వేషన్ సీఎం కేసీఆర్ చేశారని డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే రెడ్యా, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట రుణపడి ఉంటారని ఆయన అన్నారు. మునుగోడు ఉపా ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపు పొందడం ఖాయమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి రవినాయక్,వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య,రైతు సమితి కో ఆర్డినేటర్ ముండ్ల రమేష్,మాజీ ఆలయ చైర్మన్ రాజునాయక్, ఎంపీటీసీలు భాస్కర్,భోజు నాయక్,కొనతం విజయ్,నూతకి నిర్సింహారావు,వివిధ గ్రామాల సర్పంచ్ లు, రామ్ లాల్,ఎంపీటీసీలు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, మండల యూత్ నాయకులు బాణోత్ గణేష్, బానోతు రఘు, అనుబంధసంఘ నాయకులు,మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.