గిరిజనులను రెచ్చగొట్టడం పవన్‌కు తగదు

బాక్సైట్‌ తవ్వకాలకు ప్రభుత్వం వ్యతిరేకం: మంత్రి శ్రావణ్‌

విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి): ఎన్నికలు సవిూపిస్తున్న వేళ సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టడం జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు తగదని మంత్రి కిడారి శ్రావణ్‌ పేర్కొన్నారు. పాడేరు బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కిడారి సర్వేశ్వరరావు కుమారుడు మంత్రి కిడారి శ్రావణ్‌ స్పందించారు. గురువారం ఉదయం మంత్రి కిడారి శ్రావణ్‌ విలేకరులతో మాట్లాడుతూ… ఎన్నికలు సవిూపిస్తున్న వేళ సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టడం పవన్‌కు తగదన్నారు. మన్యంలో అశాంతికి జనసేన అధినేత పవన్‌ కల్యాణెళి కారణమని శ్రావణ్‌కుమార్‌ అన్నారు. ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఆజ్యం పోసి తన తండ్రి, సోమ మృతికి కారణమయ్యారని ఆరోపించారు. పాడేరు సభలో పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చంద్రబాబు వచ్చిన తర్వాత బాక్సైట్‌ తవ్వకాల జీవో నిలిపివేశారని గుర్తుచేశారు. తన తండ్రి కూడా బాక్సైట్‌కు వ్యతిరేకంగా గళమెత్తారని చెప్పారు. ఏజెన్సీలో జాబ్‌ మేళా, యువతకు శిక్షణ, నిరుద్యోగ భృతి ద్వారా ముఖ్యమంత్రి ఉపాధి కల్పించి యువత పక్కదారి పట్టకుండా చూస్తున్నారని తెలిపారు. ‘నా తండ్రి కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కోల్పోవడానికి ముఖ్యమంత్రి కంటే విూరే బాధ్యత వహించాలి. శాంతంగా ఉన్న మన్యంలో ఆనాడు పాడేరు సభలో పవన్‌ మాట్లాడి ఆజ్యం పోశారు. అందుకు ఆయనే బాధ్యత వహించాలి. ఇద్దరు గిరిజన నేతలు ప్రాణాలు కోల్పోతే కనీసం పరామర్శకు కూడా రాలేని విూరు.. మన్యం గిరిజనుల గురించి మాట్లాడతారా?’ అని ధ్వజమెత్తారు.

బాక్సైట్‌ తవ్వకాలకు ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు బాగా పని చేయాలని, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి కిడారి శ్రావణ్‌ ఆదేశించారు.

ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం

క్కపల్లి: జాతీయ బాలిక దినోత్సవాన్ని నక్కపల్లిలో గురువారం ఘనంగా నిర్వహించారు. బాలికల ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఆడపిల్లల పట్ల వివక్ష విడనాడాలని వారిని ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తారన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు అంతర్జాతీయ క్రీడాకారిణులుగా ఎదిగిన పలువురి జీవితాలను వివరించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎవ్యిూవో ప్రసాద్‌, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ వెంకటేశ్‌, ప్రధానోపాధ్యాయురాలు పుష్యరాగం పాల్గొన్నారు.