గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి
ఆదిలాబాద్, డిసెంబర్ 30 (): ఐటీడీఏ పరిధిలోని మైదాన ప్రాంతాల్లో గల ఉపాధ్యాయ ఖాళీలను గిరిజనుల అభ్యర్థులతో భర్తీ చేయాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ కిరణ్‌కుమార్, గిరిజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు రాములు డిమాండ్ చేశారు. ఈ మైదాన ప్రాంతాల్లో గిరిజనేతర అభ్యర్థులతో పోస్టులను భర్తీ చేయడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సీ 2012లో ధృవపత్రాల విచారణ పేరిట కాలయాపన చేయకుండా విచారణ కమిటీని ఏర్పాటు చేసి వెంటనే నియమాకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాలని వారు కోరారు.