గిరిజన భవన్‌ను ప్రారంభించిన మంత్రులు

ఐటిడిఎ సమావేశానికి నేతల హాజరు

భద్రాద్రి కొత్తగూడెం,జూలై8(జనంసాక్షి): భద్రాచలంలో రూ.1.10 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన భవన్‌ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యావతి రాథోడ్‌, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఆనంతరం గిరిజన భవన్‌లో సవిూకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటిడిఎ ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలక మండలి సవిూక్ష సమావేశంలో మంత్రులు పువ్వాడ, సత్యావతి పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ అధ్యక్షతన ఎర్పాటు చేసిన సమావేశంలో ఖమ్మం, మహబుబాబాద్‌ ఎంపీ లు నామా నాగేశ్వర రావు, మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతం, అనుదీప్‌ , ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మేల్యేలు సండ్ర వెంకట వీరయ్య , పోదెం వీరయ్య , వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వర రావు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, కొత్తగూడెం, మహబుబాబాద్‌ జిల్లాల జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, బిందు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.