గిరిజన సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
రూ.5 లక్షల వ్యయంతో చిట్లంకుంట లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
జడ్పిటిసి రాంబాబు నాయక్
గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జెడ్పిటిసి రాంబాబు నాయక్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని చిట్లంకుంట గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో జడ్పీటిసి నిధుల నుండి రూ.5 లక్షల వ్యయం తో నిర్మించనున్న సిసి రోడ్డు పనులను నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ హామీ, దళిత బంధుతరహాలో భూమిలేని నిరుపేద గిరిజనులకు, ఆదివాసీలకు గిరిజన బంధు హామీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గిరిజనులు, ఆదివాసీలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. దేశంలో ఎక్కలేని విధంగా గిరిజన, ఆదివాసిల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎడమ జగపతి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, సర్పంచ్ నీలా విష్ణు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.