గిరిజన సమస్యలకు బిజెపితోనే పరిష్కారం

పోడు సమస్యలు పరిష్కరించడంలో కెసిఆర్‌ విఫలం
ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు: ఎంపి

న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను బిజెపి మాత్రమే పరిష్కరించగలదని ఆదిలాబాద్‌ ఎంపి సోయం బాబూరావు అన్నారు. గిరిజనలుకు న్యాయంచేయాలన్న సంకల్పం మోడీకి ఉందన్నారు. అందుకే రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మను ఎన్నుకుని నిరూపించారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కుర్చీ వేసుకుని పోడు సమస్యలు పరిష్కరిస్తానన్న సిఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. బిజెపి అధికారంలోకి రావటం ఖాయమని, రేవంత్‌ నాయకత్వంలో యువత, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజల గోస బజెపి భరోసాతో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఆదివాసీ గూడాల్లో పోడు భూముల సమస్యను సాకుగా చూపి తెలంగాణ ప్రభుత్వం అటవీ, పోలీసు శాఖల అధికారులు ఆదివాసీలపై దాడులకు పాల్పడుతున్నారని ఆదిలాబాద్‌ ఎంపీ సోయంబాపురావ్‌ అన్నారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలకు పరిష్కారం లభించక పోగా అటవీ అధికారులు ఫారెస్టు భూములను లాక్కొని ఆదివాసీ గూడాల నుంచి అడవి బిడ్డలను తరిమేందుకు కుట్రలు చేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలంలోని కోయపోషగూడ గ్రామంలో అటవీ బిడ్డలపై ఫారెస్టు, పోలీసు అధికారులు దాడులు చేసి గాయపర్చడంతో పాటు కేసులు బనాయించారన్నారు. రాష్ట్రంలోని వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో అటవీ భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా నిర్బంధకాండను కొనసాగిస్తున్నారన్నారు. కోయపోషగూడలో 12మంది మహిళలను అధికారులు జైళ్లకు పంపించడం తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామన్నారు. ఈవిషయాన్ని మానవహక్కుల కమిషన్‌ జాతీయ చైర్మన్‌తో పాటు అధికారులు ఆవేదన వ్యక్తపరిచారని అన్నారు. జరిగిన సంఘటన పై నివేదికలు తెప్పించుకుంటామని వివరించారని ఎంపీ తెలిపారు.