గీత కార్మికులను ఆదుకోవాలి మిర్యాలగూడ. జనం సాక్షి
గీత పని వాళ్ళ సంఘం సమావేశం మిర్యాలగూడ లో నిర్వహించారు. ఈ సమావేశానికి గీత పని వాళ్ళ సంఘం జిల్లా కార్యదర్శి పబ్బు వీరస్వామి సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు గీత పనివాళ్ల సంఘం డివిజన్ నాయకులు రాయి కింది సైదులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గీత పనివాళ్ల సంఘం జిల్లా కార్యదర్శి వీరస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గీత వృత్తుల మీద ఆంక్షలు విధిస్తూ గీత వృత్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తామన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతి మెడికల్ సర్టిఫికెట్ ద్వారా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి గీత కార్మికులకు చాలా బకాయిలు ఉన్నాయి వెంటనే గీత కార్మికులకు యుద్ధ ప్రాతిపదికపైన ఎక్స్ప్రెస్లు చెల్లించాలని జూలై ఆరో తేదీ నాడు మిర్యాలగూడ నియోజకవర్గ మహాసభను యాద్గా పెళ్లి గ్రామంలో ఎస్ ఎన్ డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తామన్నారు ఈ యొక్క మహాసభకు గీత కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.జూలై 16వ తేదీ నాడు నల్లగొండ జిల్లా గీత పనిమారుల సంఘం మహాసభను నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గీత పని వాళ్ళ సంఘం గ్రామ అధ్యక్షుడు దుండిగాల వెంకన్న గువ్వల రాములు ఏ రామస్వామి గువ్వల గురుస్వామి జి మట్టయ్య నక్క శంకరయ్య జివెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



