గుంతలు పూడ్చండి –ప్రాణాలు కాపాడండి
– ప్రాణాంతకంగా మారిన ఇల్లందు ,కొత్తగూడెం ప్రధాన రహదారి
టేకులపల్లి, ఆగస్టు 18( జనం సాక్షి) : భయంకరమైన గుంతలు ఏర్పడి ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారిలో నెలకొని ఉంది. అసలే గుంతల మయంగా ఉన్న రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరింత దారుణంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ఇక్కట్లుగా మారాయి. టూ వీలర్ ,ఆటో ,కార్లు ట్రిప్పర్లు లారీలు, ఆర్టీసీ బస్సులు స్కూలు బస్సులు నిత్యం ఏదో ఒక గుంతను తప్పించబోయి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రమాదాలలో ఎందరో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు నుండి సీతారాంపురం గ్రామాల మధ్యలో మరింత దారుణంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ గుంతలను తప్పించబోయి ఇళ్లల్లోకి వాహనాలు ఎక్కడ దూరతాయోనని రోడ్డు ప్రక్కన నివాసకులు రాత్రింబవళ్లు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ఎంత దారుణంగా ఉన్న ఆర్ అండ్ బి శాఖ వారు మాత్రం పట్టించుకోకపోవడం విశేషం. నిత్యం ప్రమాదాలకు చెలిస్తున్న పోలీసులు అక్కడక్కడ వారి సొంత ఖర్చులతో కాస్త ఊరట కలిగించే విధంగా మరమ్మత్తులు చేయిస్తున్నారు.ఆర్ అండ్ బి శాఖ మాత్రం నిమ్మకు నీరు ఎత్తిన విధంగా వ్యవహరించడం సోచనీయం. నిత్యం ప్రమాదాలను అరికట్టడానికి పోలీసు శాఖ అడుగడుగునా వాహనాలను తనిఖీ చేస్తూ టూ వీలర్స్ ప్రయాణికులకు హెల్మెట్ ధరించాలని, ప్రాణాలు కాపాడుకోవాలని సూచనలు చేస్తూ ఉన్నారు. పోలీసులు బ్రతుకు కోరుతుంటే ఆర్ అండ్ బి శాఖ మాత్రం ప్రయాణికుల చావు కోరుతున్న విధంగా గుంతల మయంగా మారిన రహదారులను పట్టించుకోకపోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఉన్నతాధికారులు స్పందించి గుంతల మయంగా మ