గుంతలో పడ్డ ఆటో..ఇద్దరి మృతి
బోయినపల్లి : కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ఆటో అదుపుతప్పి ఓ గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. చందుర్తి మండలం మర్రిపెల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి అనీష్(20), పండగ జలేందర్(21) అనే ఇద్దరు యువకులు ఈ ఘటనలో మృతి చెందగా..మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.