గుజరాత్‌లో పెద్ద ఎత్తున హెరాయిన్‌ పట్టివేత


అహ్మదాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి):గుజరాత్‌లో భారీగా హెరాయిన్‌ పట్టుబడిరది. ద్వారకా జిల్లాలోని మోర్బి సవిూపంలో ఉన్న జింజుడాలో సోమవారం ఉదయం 120 కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ (ఏటీఎస్‌) స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్‌ నుంచి ఇండియాకు భారీగా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి ఇండియాకు కాగా, దీని విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు కేసు నమోదు
చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.