గుత్తేదారు శిబిరంపై గ్రామస్థుల దాడి

రామడుగు: మండలంలోని కీస్తంపల్లి సమీపంలోని ప్రాణహిత చేవెళ్లె ఎనిమిదో ప్యాకేజ్‌ గుత్తేదారు శిబిరంపై వెంకట్రావుపల్లి గ్రామస్థులు సోమవారం దాడి చేశారు. శిబిరంలోని ఫర్నిచర్‌, వాహనాలను ధ్యంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొరంగ పేలుళ్ల కారణంగా తమ ఇళ్లు కూలిపోతున్నాయని సిబ్బందితో వాగ్వాదానికి
దిగారు. తమకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని కోరారు. వారం రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామని గుత్తేదారుల మెగా కంపెనీ జనరల్‌ మేనేజర్‌ సురేందర్‌ అన్నారు.