గూగుల్‌ పేగా మారిన తేజ్‌ యాప్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): గూగుల్‌కు చెందిన యూపీఐ ఆధారిత పేమెంట్‌ యాప్‌ తేజ్‌ పేరును ఆ సంస్థ మార్చింది. తేజ్‌ ఇక నుంచి గూగుల్‌ పే కానుంది. ఈ బ్రాండ్‌ మార్పు వల్ల యూజర్లు రీటెయిల్‌ స్టోర్స్‌కు పేమెంట్లు చేయడంతోపాటు వివిధ యాప్స్‌లో ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్స్‌ చేసే వీలుంటుంది. దేశంలో గూగుల్‌ ప్రవేశపెట్టిన తొలి డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ అయిన తేజ్‌ గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. తేజ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 75 కోట్ల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ. 2 లక్షల కోట్లు అని గూగుల్‌ తెలిపింది. ప్రతి నెల ఈ యాప్‌ను 2.2 కోట్ల మంది వాడుతున్నారని పేమెంట్స్‌ అండ్‌ నెక్ట్స్‌ బిలియన్‌ యూజర్స్‌ ఇనిషియేటివ్‌ మేనేజర్‌ సీజర్‌ సేన్‌గుప్తా తన బ్లాగ్‌పోస్ట్‌లో రాశారు.